Napačna izbira? Nič za to! Izdelke lahko vrnete do 30 dni
Z darilnim bonom ne morete zgrešiti. Obdarovanec lahko v zameno za darilni bon izbere karkoli iz naše ponudbe.
Do 30 dni za vračilo
నా మాట
వాల్మీకి రామాయణ సంగ్రహము 123 సం॥తరువాత ముద్రించుటకు నేను చేసిన ప్రయత్నం ఈరోజు సఫలమయినది . కీర్తిశేషులు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహము నాకు పెద తాతగారు. ఆయనకు సంతానము లేదు. ఆయనకు ఒకడే తమ్ముడగు స్వర్గీయ చిలకమర్తి కృష్ణమూర్తి కి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు. వీరందరూ చిలకమర్తి లక్ష్మీనరసింహము గారి ప్రీతి పాత్రులై ఆయనయందు అమిత గౌరవము కలిగి, తమ సంతానమునకు కవి చిలకమర్తిని గురించి, ఆయన సాహిత్యము గురించియు చెప్పేవారు. వారిలో మొదటి కుమార్తె స్వర్గీయ పెరుమాళ్ల సుబ్బలక్ష్మి మా తల్లిగారు. ఆమె నా బాల్యంలోనే వాళ్ళ పెదనాన్న గారి రచనలను పరిచయం చేసారు. లక్ష్మీనరసింహంగారి గయోపాఖ్యానము, కృపాంభోనిధి పద్యాలు పాడుతూ ఉంటే నాకు ఆశ్చర్యంగా ఉండేది. మా తల్లిగారి వలననే నాకు తెలుగు సాహిత్యంపట్ల అభిరుచి కలిగింది .
స్వర్గీయ చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన "వాల్మీకి రామాయణ సంగ్రహం" 1922 లో ప్రచురణ జరిగనది. ఇప్పుడు ఆ పుస్తకము పాఠకులకు అందుబాటులో లేని కారణంగా మళ్ళీ ముద్రించాలని నిర్ణయించాము . ఈ సదవకాశం నాకు లభించడం నా అదృష్టం. మా తల్లిగారి మధుర స్మృతి చిహ్నంగా ఈ "రామాయణ సంగ్రహము" కొత్తదనముతో పాఠకులకు అందుబాటులోకి వచ్చింది. ఇది సకాలంలో ముద్రించి ఇచ్చిన కస్తూరి విజయం పబ్లికేషన్స్ కు కృతజ్ఞతాభినందనలు. అచ్చు వేయుటకు పి.డి.ఫ్ అందించిన తమ్ముడు శ్రీ పెరుమాళ్ల రఘునాథ్ కు శుభాశీస్సులు.ఈ ప్రయత్నంలో ముద్రణ ఖర్చు బాధ్యతను ఆనందంగా తీసుకున్న నా కుమార్తె శ్రీమతి సంధ్యా దీప , కుమారుడు శ్రీ సచిన్ కమలాకర్ రావు కు ఆశీస్సులు
డా. పి . మాణిక్యాంబ 'మణి'
Pozdravljeni! Sem Libroamiko, vaš knjižni svetovalec.
Kako vam lahko pomagam?