Napačna izbira? Nič za to! Izdelke lahko vrnete do 30 dni
Z darilnim bonom ne morete zgrešiti. Obdarovanec lahko v zameno za darilni bon izbere karkoli iz naše ponudbe.
Do 30 dni za vračilo
నా లోకం కవిత్వం.ఇది నాకు సమాజాన్ని కొత్తగా పరిచయం చేసింది. నన్ను సమాజానికి కొత్తగా పరిచయం చేసింది. కవిత్వం లేకపోయి ఉంటే నేనేమైపోయేవాడినో ఒక్కోసారి తల్చుకుంటేనే భయం వేస్తుంది. కవిత్వం నా జీవితంలో తల్లిలాంటి పాత్ర పోషించింది. కవిత్వం ఒక ఓదార్పు.కవిత్వం ఒక సాంత్వన. కవిత్వం నా జీవితానికి నిరంతర స్ఫూర్తి. జీవితంలో ఎలాంటి వెలితి వచ్చినా నన్ను అక్కున చేర్చుకొని ఆదరించేది కవిత్వమే.అలా కవిత్వం నా బతుకులో ఒక అవిభాజ్యమైన భాగం.
నేను జీవితంలోనైనా, కవిత్వంలోనైనా సత్యాన్నే విశ్వసిస్తాను.కవిత్వం వైయక్తిక అనుభవాల మీదుగా సమాజంలోకి ప్రవేశించాలన్నది నా దృఢ నిశ్చయం.భావాల దగ్గరి నుంచి భౌతిక వస్తువుల దాకా సమాజంతో సంబంధం లేకుండా ఏదీ విడిగా ఉండటానికి అవకాశం లేదు.కళలు కూడా అంతే. సాహిత్యం కూడా సమాజం కోసమే.కాబట్టి సమాజంలో జరుగుతున్న అన్ని పరిణామాలను వాటి ఫలితాలతో సహా కవిత్వం పట్టుకోవాలన్నది నా ఉద్దేశం.కవిత్వం వర్తమానాన్ని రికార్డు చేయగల ఒక చారిత్రక పనిముట్టు.అనేక ఇతర అంశాలతో పాటు కవిత్వం కూడా సమాజ పురోగమనాన్ని ఆశించాలి. దానిని ప్రతిబింబించాలి.ఈ నా భావాలకు అనుగుణంగా నేను ఎంతవరకు రాసానో నన్ను నేను సరిగ్గా అంచనా వేసుకోలేను కానీ కొంత ప్రయత్నం మాత్రం చేశానని చెప్పుకోగలను. నేను రాసిన వాక్యాల్లో కవిత్వం ఉన్నా లేకున్నా సత్యం మాత్రం ఉందనే నమ్మకంతో ఈ పుస్తక ప్రచురణకు పూనుకున్నాను.నిజం కోసం నిలబడని ఏ కళకైనా సరియైన విలువ ఉంటుందని నేను అనుకోను.